బోధన్ శివాలయంలో కొబ్బరికాయల దుకాణం లీజు వేలం

నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కొబ్బరికాయలు, పూజా సామాగ్రి విక్రయ దుకాణం నిర్వహణకు రెండేళ్ల లీజు వేలం జరిగింది. ఈ వేలంలో బోధన్‌కు చెందిన జి. రాజు దేవి సంవత్సరానికి రూ. 1,50,000 చొప్పున, రెండేళ్లకు మొత్తం రూ. 3 లక్షల అత్యధిక పాట పాడి లీజును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాములు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజాతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్