రెంజల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎస్సై రాజుకు వినతి పత్రం సమర్పించారు. తమ పంట నష్టానికి తగిన పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.