బోధన్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే షకీల్ పై విమర్శలు చేయడం సరికాదని, తమ వార్డులలో అభివృద్ధికి కృషి చేస్తున్నామని కౌన్సిలర్లు తెలిపారు. సోషల్ మీడియాలో విమర్శలు ఆపి, కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్న ఎంఐఎం కౌన్సిలర్ తన వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.