బోధన్ ఎమ్మెల్యేకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వినతి పత్రం

కులగణన డేటా ఎంట్రీ డబ్బులు ఇప్పించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి డేటా ఎంట్రీ ఆపరేటర్లు గురువారం వినతి పత్రం ఇచ్చారు. గత నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులగణన డాటా ఎంట్రీ పేరుతో ఆన్ లైన్ కంప్యూటర్ డాటా ఎంట్రీ చేసిన డబ్బులను ఇప్పటికి ఇవ్వడం లేదని, ఈ విషయమై పలు మార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని, గత నెల కలెక్టరేట్లో ప్రజావాణిలో కూడా విన్నవించడం జరిగిందన్నారు. కానీ కులగననా చేసినప్పుడు అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రైవేట్ ఆపరేటర్లకి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.

సంబంధిత పోస్ట్