కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: పేదల కుటుంబాలకు ప్రభుత్వ తోడ్పాటు

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని భీంగల్ పట్టణంలో పిప్రి గ్రామంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ అరిగేల జనార్దన్, వార్డ్ సభ్యులు పాల్గొని అర్హులైన మహిళలకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో తోడ్పడుతున్నాయని, లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్