ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి స్వయంభు లింగేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఈ ఘటనలో దుండగులు నగదు, ఆలయ నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ తెలియజేశారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలు రికార్డు కావడంతో పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.