దళారులను నమ్మి మోసపోవద్దు

ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ దత్తాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ పంటను సులభంగా అమ్ముకోవచ్చని, తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్