బోధన్‌లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో అగ్నిప్రమాదం, కాంగ్రెస్ నేతల పరామర్శ

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, వార్డు నెం.18లో లింగడోళ్ల గంగారాం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి, ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న కాంగ్రెస్ మున్సిపల్ మాజీ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి, వార్డు ఇంచార్జ్ చిత్రాల ప్రమోద్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.10,000 నగదు, ఒక క్వింటాల్ బియ్యం అందజేశారు. అలాగే, వారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉంటామని మాజీ చైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్