బోధన్ పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మీడియా సమావేశం నిర్వహించి, గత రెండేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే భవనాలు పశువులకు నిలయాలుగా మారాయని, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే కార్యాలయాలు సైతం నిజామాబాద్‌లో కలవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే సంతోషిస్తానని, అయితే అప్పటివరకు నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను భయపెట్టడం సరికాదన్నారు.