బోధన్ పట్టణంలో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం

బోధన్ పట్టణ మున్సిపల్ పరిధిలోని రాకాసిపేట్, శక్కర్ నగర్ లోని హౌసింగ్ బోర్డ్, ఆజంగంజ్ లోని వాటర్ ట్యాంకుల పరిధిలోని కాలనీలకు సోమవారం మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్బర్ నగర్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడం వలన మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని అప్పటి వరకు నీరు అందించలేమన్నారు. కావున ప్రజలు దీనిని గమనించి సహకరించాలని మున్సిపల్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్