ఎరాజ్ పల్లి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు

బోధన్ మండలంలోని ఎరాజ్ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సాధన కోసం ఆయన సత్యం, అహింస, శాంతి, సమానత్వం అనే ఆయుధాలను ఎంచుకున్నారని, ఆయన చూపిన ఆశయ సాధనాలలో అందరూ సాగాలని కోరారు. సర్పంచ్ దాస్ గౌడ్, ఉప సర్పంచ్ పవన్, కార్యదర్శి సతీష్, పాలక వర్గ సభ్యులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕