బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించింది. ఈ నేపథ్యంలో, ఆయన శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సుదర్శన్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.