రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన సౌజన్యంతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చైర్మన్ కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు నూతన గృహాల్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, ఇంచార్జి కార్యదర్శి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.