బోధన్ పరిధిలోని కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం 4 కోట్ల 26 లక్షల లాభాల బాటలో నడుస్తోందని అధ్యక్షులు సునీల్ కుమార్ చౌదరి తెలిపారు. సోమవారం జరిగిన విండో మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, 11 గ్రామాల పరిధిలోని ఈ విండో, పోతంగల్, కోటగిరి ఉమ్మడి మండలాల కంటే అధిక లాభాలు ఆర్జిస్తోందని వివరించారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా 3 గ్రామాల్లో విక్రయాలు జరుగుతున్నాయని, త్వరలో రైస్ మిల్లును కూడా పునఃప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విండో సభ్యులు పాల్గొన్నారు.