రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రాఖీ పండుగ అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ గణపతి పీరాజీ కాంబ్లే పాడేవార్ (50) మృతి చెందారు. బోదన్ నుంచి బోదేపల్లికి బైక్‌పై వెళ్తుండగా, ఎడపల్లి రైల్వే గేట్ దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన గణపతిని బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బైక్ నడిపిన సూర్యకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎడపల్లి ఎస్సై రమమంగళవారం  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్