గంజాయి తరలింపు.. నిందితుల రిమాండ్

మంగళవారం బోధన్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బోధన్ కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న మహ్మద్ ఆఫ్రోజ్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం పట్టణ శివారులోని రవి గార్డెన్ వద్ద వాహన తనిఖీలో అనుమానాస్పదంగా వస్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1985 గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాందేడ్ కు చెందినవాడని, అక్కడి నుంచి బోధన్ కు గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలిపారు. బోధన్ లో గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్