నిజామాబాద్: వివాహేతర సంబంధం.. ఇద్దరు బలి

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం, మేడిపల్లి తండాకు చెందిన ఆనంద్, వర్ని మండలం పొట్టిగుట్ట తండాకు చెందిన పాత్లోత్ కవితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మంగళవారం కవిత ఇంటికి వచ్చిన ఆనంద్, 'నన్ను పక్కన పెట్టావు' అని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆనంద్ కత్తితో కవితపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన ఆనంద్‌ను మృతురాలి కుటుంబ సభ్యులు రాళ్లతో కొట్టగా, అతను తీవ్ర గాయాలతో పొలంలో పడిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆనంద్‌ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్