నిజామాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

శుక్రవారం జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామంలో దండుగుల వెంకట్ (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాలుగేళ్ల కిందట సురేఖను వివాహం చేసుకున్న వెంకట్, మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల అత్తగారి ఊరికి వచ్చిన వెంకట్, శుక్రవారం కౌలాస్ నాలా జలాశయం ఎగువన మృతదేహంగా కనిపించాడు. భార్యతో గొడవ కారణంగా మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్