ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మంగళవారం ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఇబ్రహీంపేటకు చెందిన గంగాధర్ (40) అనే వ్యక్తి జాకోరా గ్రామ అటవీ ప్రాంతంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 12 ఏళ్ల క్రితం జాకోరా గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న గంగాధర్, మండల కేంద్రంలో ఉంటూ కూలీ పని చేసుకునేవాడు. ఈ క్రమంలో, ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడటంతో, ఆమె గత కొంతకాలంగా దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్