భీమ్ గల్ మండలంలోని పల్లికొండ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ క్రీడలకు ఎంపికయ్యారు. ఈ నెల 8 నుండి 10 వరకు వనపర్తిలో జరిగే SGF అండర్ 17 ఇయర్స్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు మాలవత్, అఖిల, కొత్తపల్లి శ్రీనిత్ ఎంపికయ్యారు. గతంలో జరిగిన SGF అండర్ 14 బాల బాలికల విభాగంలో ఎర్రోళ్ల ధనా శ్రీ, భూక్యా స్నేహ, బందెల చైతన్య కూడా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చిన్నయ్య శనివారం తెలిపారు.