ఎడపల్లిలో గురువారం అంగన్వాడి కేంద్రాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించి కేంద్రాలకు వచ్చే చిన్నారి బాల బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించాలని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్ట్ సీడీపీఓ పద్మజ అన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట సెక్టార్లో, మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సీడీపీఓ వేరువేరుగా అంగన్వాడి ఉపాధ్యాయులకు నెలవారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.