బోధన్ మండలంలోని పెగడపల్లి పరిధి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గ్రామానికి చెందిన దేర్రావు (28) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.