రెంజల్ మండలంలోని కందకుర్తి పరిధిలోని మొఘల్పుర శివారులో గోదావరి ఒడ్డుపై అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వ లను సోమవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. మొఘల్ పుర శివారు లో సుమారు 300 ట్రాక్టర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన ఇసుక నిల్వ లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తామని తహశీల్దార్ శ్రావణ్కుమార్ తెలిపారు. ఆయన వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు.