కోటగిరి పోలీసులు తెల్లవారుజామున గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆటోలను కోటగిరి పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దృష్టి సారించారు.