వర్ని మండలంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగి, ఆమె ఏడు నెలల గర్భవతి అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఈ విషయం తెలిసింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సమీప తండాకు చెందిన గణేష్ (24) అనే యువకుడు ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు.