నూతన సంవత్సరం సందర్భంగా బాన్సువాడలోని నెమలి సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై సాయిబాబా ఆశీస్సులను పొందారు. గుడిలో అన్నదానం, ప్రసాదం కోసం జనాలు ఎగబడటంతో తోపులాట జరిగింది. గుడి బయట దుకాణాల సముదాయం భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో జాతర వాతావరణం నెలకొంది.