మారుతి మందిరంలో కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు

మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజల తరపున ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఇదేవిధంగా జన్మదిన వేడుకలను జరుపుకోవాలని భగవంతుడిని కోరుకున్నారు. ఈ పుజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్