బోధన్ మారుతి మందిరంలో శ్రావణ మంగళవారం ప్రత్యేక పూజలు

బోధన్‌లో బుధవారం శ్రావణ మాస మూడవ మంగళవారం సందర్భంగా మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తమలపాకులతో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించగా, విజయసాయి కరస్పాండెంట్స్ డాక్టర్ కృష్ణమోహన్ శర్మ, మాశెట్టి రఘురామ్, ప్రకాష్ గుప్తా, రాజా గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి రాములు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సజావుగా సాగింది.

సంబంధిత పోస్ట్