బోధన్ పట్టణంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గురువారం ‘బడి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును ప్రోత్సహించే లక్ష్యంతో, రాకాశిపేట్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను కలిసి, నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలు, వసతుల గురించి వివరించారు. వెంకట్, శ్రీకాంత్, కిషన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.