నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామంలో గురువారం ఉదయం గణేశ్ (35) అనే వ్యక్తి తన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం రాత్రి భార్యను ఇంటికి పంపించి తాను ఒక్కడినే ఉంటానని చెప్పిన గణేశ్, ఉదయం శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి ఒక పాప, బాబు ఉన్నారు.