*ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలి*

కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, రైతుల నుంచి ధాన్యం సేకరించిన మీదట వారికి రసీదులు అందించాలని, సదరు రైతు వివరాలు క్రాప్ బుకింగ్ డేటాలో నమోదై ఉన్నాయా అని పరిశీలించుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి, సేకరించిన ధాన్యం పరిమాణం, రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్