ఎడపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో జడల భూమయ్య అనే వ్యక్తి ఎడపల్లి పులిచెరువు వద్ద చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల తీసుకున్న అప్పులు తీర్చలేక మనస్తాపానికి లోనయ్యాడని ఎస్ఐ ముత్యాల రమా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.