ద్విచక్ర వాహనం చోరీ

బోధన్ పట్టణంలో సోమవారం అర్థరాత్రి ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. లోలే శివాజీ అనే వ్యక్తి తన వాహనాన్ని ఎస్బీఐ బ్యాంకు ఎదుట జయసాయి టిఫిన్ సెంటర్ వద్ద ఉంచగా, గుర్తు తెలియని యువకుడు దొంగ తాళం చెవితో వాహనాన్ని దొంగిలించి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ వెంకట నారాయణ మాట్లాడుతూ, చోరీకి గురైన వాహనాన్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపడుతున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్