వర్ని మండలంలోని జనరల్ ఫంక్షన్ హాల్లో, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, రుద్రూర్, పోతంగల్ మండలాల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో అధికారులు, కమిటీ సభ్యులతో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు.