అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలి: మల్లేష్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటి నగర్ లో గల ప్రభుత్వ హైస్కూల్లో మంగళవారం భగత్ సింగ్ 119వ వర్ధంతి సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ పిడిఎస్‌యు, పివైఎల్, పిఓడబ్ల్యుల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పిఓడబ్ల్యు బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి అధ్యక్షత వహించారు. ముఖ్యవ్యక్తిగా హాజరైన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ కమిటీ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ, అమెరికా ఆధిపత్య, యుద్ధోన్మాద ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని, షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕