తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యం నిల్వలను సైతం సేకరించి రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. గురువారం ఆయన నవీపేట, రెంజల్, ఎడపల్లి మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యం అంతటిని ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి సంశయాలకు గురి కావద్దని ఆయన సూచించారు.