నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈ నెల 10న చేనేత సహకార సంఘం ఎన్నిక జరగనుంది. బోధనకు చెందిన జోర్రిగాల లక్ష్మీ, జోర్రిగాల రవీందర్ ఎన్నికల అధికారి జియా ఉద్దీన్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.