నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో భార్య స్వరూప, తన ప్రియుడితో కలిసి భర్త మహిపల్‌ను హత్య చేసింది. మహిపల్ మృతదేహాన్ని ఉరివేసి, గుండె నొప్పితో చనిపోయినట్లు చిత్రీకరించారు. మహిపల్ మెడపై గాటు కనిపించడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.