హోలీ పండగ సందర్భంగా మోస్రాలో వీడిసి పెద్దలు కుస్తీ పోటీలు ఆదివారం నిర్వహించి కామ దహనం చేశారు. ఈ పోటీల్లో మల్ల యోధులు పోటాపోటీగా తలపడ్డారు. ప్రతి సంవత్సరం హోలీ పండగ సందర్భంగా ఈ కుస్తీ పోటీలు నిర్వహిస్తామని, పండగ వేళ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని వీడిసి పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పండగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.