రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామానికి చెందిన నక్కల్వార్ రాజు అలియాస్ నాగరాజు (30) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆదివారం బాసర నుంచి నవీపేట వైపు బైక్‌పై వస్తుండగా నాగేపూర్ శివారులో బైక్ అదుపుతప్పి కిందపడటంతో రాజు తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు లేరని, అతను అవివాహితుడని పేరన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్