కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో గుండె కల్లూరుకు చెందిన తిమ్మల్ వార్ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వెంటనే చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.