బిచ్కుంద: సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయకుంటే ధర్నా

బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్నరాజులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నాలు చేపడతామని సోమవారం హెచ్చరించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గెలిచి రెండేళ్లయినా హామీలు మర్చిపోయారని, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణాతార, శెట్పల్లి విష్ణు, పీరాజీ, రాథోడ్ సునీత, పత్తి రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్