కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ విద్యుత్ సబ్ స్టేషన్ లో శుక్రవారం కాటేపల్లి తాండా రైతులు ధర్నా నిర్వహించారు. ప్రతి రోజు విద్యుత్తు కోతలు విధించడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా రికార్డులు ఇచ్చినట్లు రాయడాన్ని తప్పు పట్టారు. డీడీలు కట్టిన కనెక్షన్ ఇవ్వట్లేదని తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు ధర్నా విరమించేది లేదని తెలిపారు.