జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో, బిచ్కుంద సీఐ రవికుమార్ నేతృత్వంలో ఎస్సైలు మోహన్ రెడ్డి, పెద్దకొడపుగల్ ఎస్సై తదితరులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి వద్ద నుంచి ₹10,700 నగదు, 9 మొబైలు ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.