రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: మహిళకు తీవ్ర గాయాలు

నిజాంసాగర్ మండల పరిధిలోని జాతీయ రహదారి-161పై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గవ్వల సంగయ్య (48) మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. బ్రాహ్మణపల్లి శివారులో అంజనాద్రి సమీపంలో అశోక్ లీలాండ్ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. స్థానికులు క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సంగయ్య మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్