జుక్కల్ సెగ్మెంట్ బిచ్కుంద మండలం పెద్దదేవాడ శివారులో బాన్సువాడకు వెళ్లే రహదారిపై బ్రిడ్జి వద్ద ఆడశిశువును పోలీసులు శుక్రవారం గుర్తించారు. వారు నవజాత శిశువును పుల్కల్ పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం సీడీపీఓకు సమాచారం ఇచ్చారు. పాప సంరక్షణ కోసం సిడీపీఓకు పాపను అప్పగించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.