జుక్కల్ సెగ్మెంట్ పెద్దకొడఫ్గల్ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఓ లారీ అదుపు తప్పి ఫ్లై ఓవర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా వివరాలు తెలియాల్సి వుంది.