తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన మానస (13) అనే బాలిక సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాడ్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.