ప్రజావాణిలో 80 దరఖాస్తులు స్వీకరణ

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 80 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్