కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హిల్చిపూర్ శివారులో సమాచారం అందుకున్న పోలీసులు, వారి వద్ద నుండి ఒక కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు యాభై వేల రూపాయలు ఉంటుందని అంచనా. వీరి వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్ళు, 8 మొబైల్ ఫోన్లు, 3000 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుండి గంజాయిని తెప్పించి, కామారెడ్డి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.